అంబులెన్సు రిపేర్ కి సినీ నటులు ఆదిత్య ఓం - నిర్మాత విజయ్ వర్మ సహకారం
భద్రాచలం దగ్గరలోని మారుమూల ప్రాంతమైన దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీకి , ముఖ్యంగా చెరుపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాలకి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో సినీ నిర్మాత విజయ్ వర్మ పాకలపాటి ప్రోద్బలంతో అమెరికా లోని షిర్డీ సాయి సంస్థాన్ , రోటరీ క్లబ్ మరియు సినీ హీరో బిగ్ బాస్ ఫేమ్ ఆదిత్యాఓం ఆర్థిక సహాయంతో ఒక అంబులెన్సు ని కొని ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వేలాది ప్రాణాలను కాపాడిన ఈ అంబులెన్సు రిపేర్ కి వచ్చిందని కొద్దీ మొత్తం సహాయం కావాలని స్థానిక సామాజిక వేత్త రేసు ఆదినారాయణ మూర్తి కోరిక మేరకు నటులు ఆదిత్యాఓం నిర్మాత విజయ్ వర్మ పాకలపాటి లు పది వేల రూపాయల సాయం అందించుటయే కాక తరుచుగా వచ్చే ఈ రిపేర్ లకై ఒక నిధిని తయారు చేద్దామని , ఇందునిమిత్తం తమ వంతుగా సహాయం అందిస్తామని మాట ఇచ్చారని రేసు ఆదినారాయణ మూర్తి హర్షం వ్యక్తం చేశారు