- విజయవాడ లో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు లో "ఆరుద్ర సభా వేదిక" పై మెరిసిన
ఆదిత్య రమ
రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్,రాజమండ్రి మొల్ల డా.బి హెచ్.వి.రమాదేవి విజయవాడ వన్ టౌన్ కె .బి.ఎన్.కాలేజి లో జరిగిన 6వ ప్రపంచ రచయితల మహాసభ లో *ఆరుద్ర సభావేదిక* పై *యువత కొరకు అనేక ప్రక్రియలపై ఎలాంటి మార్పు రావాలి!?* అనే అంశంపై ఆమె ప్రసంగించారు.చక్కని ప్రసంగం చేసి ,సీసపద్యం అశువుగా చెప్పినందుకు పలువురు అభినందించారు. డి.ఎన్.ఏ ఛానల్ వారు వాయిస్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భం గా ఆదిత్య అధినేత ఛైర్మన్ డా.నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ డా.ఎన్. సుగుణా రెడ్డి, రాజమండ్రి విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్.పి.గంగిరెడ్డి, ప్రిన్సిపాల్స్ సి హెచ్. ఫణి కుమార్, ఎస్. కె.ఎన్.రెహ్మాన్, చంద్రశేఖర్, రామకృష్ణ లు,అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.ఆదిత్య ఎన్.. ఎస్ . ఎస్. డీన్ డా.జి.వి. ఎస్.నాగేశ్వర రావు మాట్లాడుతూ ,డా.రమాదేవి అదిత్యలో సాహిత్య , సేవారంగాలలో కూడా అతి చురుకుగా వ్యవహరిస్తారని , తనకు ఎన్. ఎస్.లో కూడా అత్యంత సహకారంగా వుంటారనీ ఆయన అభినందించారు.డైరెక్టర్ గంగిరెడ్డి మాట్లాడుతూ రమాదేవి అదిత్యకు ఒక తలమానికం అనీ, సేవా,సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ఆమె సేవలు గణనీయం అని చెప్పారు.ఆదిత్య కు ఎక్కువ బహుమతులు రావడానికి, ఆమె ఇచ్చే శిక్షణ ప్రధాన కారణం ఆమెఅణువణువు నా ,అడుగడుగునా ,విద్యార్థుల లో సృజనను ప్రోత్సహించడానికి ఆమె తీసుకునే శ్రద్ధ ,శిక్షణ మాత్రమే కారణం అని ఈ సందర్భంగా తెలియ జేశారు. ఆమెకు కళా గౌతమి, అ.ర.సం,తెలుగు వెలుగు సాహితీ వేదిక,సాహితీ రస స్రవంతి,మొదలైన సాహితీ సంస్థలు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.