షీరో హోమ్ ఫుడ్ కి రతన్ టాటా పురస్కారం
మహిళలు తాము చేసిన ఇంటి వంటకాలు ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు జరిపి ఇంటినుండి స్వయం ఉపాధి పొందేలా వందలాది మహిళలకు ఉచిత శిక్షణ అందించి జీవితంలో స్థిరపడేలా తీర్చి దిద్దిన షీరో హోమ్ ఫుడ్ సంస్థకు రతన్ టాటా పురస్కారం లభించింది.రతన్ టాటా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈఫిల్ లైఫ్ సొసైటీ నిర్వహించిన ఈ కార్యక్రమం లో మహిళా సాధికారికతా విభాగంలో షీరో సంస్థ కోఆర్డినేటర్ వీస్ విజయ్ వర్మ పాకలపాటి కి ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్ ఈ పురస్కారాన్ని అందజేశారు.తమని ఎంపిక చేసిన ఈఫిల్ సొసైటీ అధ్యక్షులు శివరాం కి కృతఙ్ఞతలు తెలిపిన విజయ్ వర్మ మాట్లాడుతూ ఇప్పటికే తమ సంస్థ ద్వారా 300 పైబడి మహిళలు ఉపాధి పొందుతున్నారని, దక్షిణాది ఉత్తరాది రుచుల ఉచిత శిక్షణలో పాల్గొని షీరో ద్వారా ఉపాధి పొందగోరు గృహిణులు 6309527444 నెంబర్ లో సంప్రదించవచ్చని తెలియజేసారు