విజ్ఞాన్స్ యూనివర్సిటీ అధ్యాపకుడికి డాక్టరేట్
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మడకా కృష్ణ చెన్నకేశవరావు అనే అధ్యాపకుడికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో తమ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఇన్వెస్టిగేషన్స్ ఆన్ కాంపాక్ట్ సీపీడబ్యూ ఫెడ్ సర్కులర్లీ పోలరైజ్డ్ వైడ్ అండ్ డ్యూయల్ బ్యాండ్ యాంటీనాస్ ఫర్ 5జీ, వైర్‌లెస్ ల్యాన్ అండ్ శాటిలైట్ అప్లికేషన్స్’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఈసీఈ డిపార్ట్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పచియానన్ ముత్తుస్వామి గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా 2 ఎస్‌సీఐ, 4 స్కోపస్ పేపర్లు పబ్లిష్ చేశారని వెల్లడించారు. పీహెచ్‌డీ పట్టా పొందిన మడకా కృష్ణ చెన్నకేశవరావును వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.