సాయం చెయ్యడంలోనే నిజమైన క్రిస్మస్
- సినీ దర్శకుడు దిలీప్ రాజా
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
పేదలకు ఇవ్వడంలోనే నిజమైన క్రిస్మస్ ఉందని సినీ దర్శకుడు,పెన్నీ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవాసంస్థ వ్యవస్థాపకులు దిలీప్ రాజా అన్నారు. పెదరావూరు గ్రామంలోని పెన్నీ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవాసంస్థలో వితంతువులకోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.సమావేశానికి సంస్ధ డైరెక్టర్ ప్రదీప్ దోనేపూడి అద్యక్షత వహించారు. వృద్ధాప్యంలో ఉన్న జన్మనిచ్చిన తల్లితండ్రులను ఆదరించడంలో బిడ్డగా రుణం తీర్చుకున్నట్లు అవుతుందని దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు.క్రిస్టమస్ రోజుల్లో క్రీస్తు బోధనలను మానవాళి ఆచరించడం ఎoతగానో అవసరం అన్నారు. ప్రపంచ యుద్ధాలను నివారించే శక్తి క్రీస్తుచూపిన ప్రేమ మార్గంలో ఉందని ఆయన పేర్కొన్నారు.ఈసందర్భంగా వితంతువులకు ఆయన నూతన వస్త్రాలను,నిత్యావసరాలను పంపిణి చేశారు .కార్యక్రమములో సహాయ దర్శకులు నరేష్ దోనె, మణి చింతా,తదితరులు పాల్గొన్నారు.