*వరలక్ష్మి శరత్ కుమార్ పాన్-ఇండియా చిత్రం*
*"అర్జునుడి గీతోపదేశం"*
*చిత్రానికి "సినెటేరియా మీడియా వర్క్స్" బ్రాండింగ్*
ఫస్ట్ కట్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానరుపై ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో వెలిచెర్ల ప్రదీప్ రెడ్డి, త్రిలోక్ నాథ్ కలిశెట్టి నిర్మిస్తున్న పాన్-ఇండియా చిత్రం "అర్జునుడి గీతోపదేశం" చిత్రానికి ప్రముఖ ఫిలిం బ్రాండింగ్ సంస్థ సినెటేరియా మీడియా వర్క్స్ ఇన్-ఫిలిం బ్రాండింగ్, పోస్ట్ ఫిలిం బ్రాండింగ్, ప్రొమోషన్ ఫిలిం బ్రాండింగ్ సర్వీసులను అందిస్తోంది.
సతీష్ గోగడ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాజీవ్ సాలూరి, అఖిల్ రాజ్, ఆదిత్య శశికుమార్, సదన్, దివిజ ప్రభాకర్, మౌనిక, కల్పన, వసంతిక మచ్చ, బద్రం తదితరులు నటిస్తున్నారు. సంగీతం: చరణ్ అర్జున్, సినెమాటోగ్రఫీ: చైతన్య కందుల.
ఇటీవలే హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలో రూపుదిద్దుకుంటోంది.
*సినెటేరియా మీడియా వర్క్స్*
ఫిలిం నగర్, జూబిలీ హిల్స్, హైదరాబాద్
ఫోన్ నెంబర్: 0 83416 89555