ఫార్మసీ సిలబస్‌ను డిజిటలైజ్ చేయబోతున్నాం - ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ మోంటుకుమార్ ఎం.పటేల్ - విజ్ఞాన్ ఫార్మసీలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్న ఇండస్ట్రీ అవసరాలు, టెక్నాలజీలకు అనుగుణంగా ఫార్మసీ సిలబస్‌ను డిజిటలైజ్ చేయబోతున్నామని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ప్రెసిడెంట్ డాక్టర్ మోంటుకుమార్ ఎం.పటేల్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ ఫార్మసీ కళాశాలలో ‘‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ పర్సనలైజ్డ్ డ్రగ్ డిస్కవరీస్– ఏ ఫ్యూచరిస్టిక్ అప్రోచ్’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌ను ‘‘ నెక్ట్స్‌జెన్ ఫార్మా కనెక్ట్–2025’’ అనే ఇతివృత్తంతో గురువారం ఘనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించిన తర్వాత ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన సావనీర్‌ను విడుదల చేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ మోంటుకుమార్ ఎం.పటేల్ మాట్లాడుతూ పీసీఐ ద్వారా విద్యార్థులకు, అధ్య...