తెలుగుతనం ఉట్టిపడేలా యాంకర్ రజని వ్యాఖ్యానం
జనవరి 20వ తేదీన స్వర్గీయ కృష్ణంరాజు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎఫ్ టీ పీ సి ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు వివిధ రంగాల వారికి కృష్ణంరాజు ప్రతిభా పురస్కారాలని
హైదరాబాద్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో అందజేశాయి. సినీ రాజకీయ సామాజిక సేవా రంగాల వారు విచ్చేసిన ఈ కార్యక్రమానికి ఏంకర్ గా వ్యవహరించిన రజని లిజు తన వ్యాఖ్యాన చాతుర్యంతో విచ్చేసిన అతిధులు, అవార్డు గ్రహీతలు మరియు వీక్షకులను తన వ్యాఖ్యాణ చాతుర్యంతో మంత్ర ముగ్దులను చేశారు.ఓ రకంగా చెప్పాలంటే తెలుగు వారికి లభించిన మరో వ్యాఖ్యాణ ఆణిముత్యం రజని లిజు అన్నది నా అభిప్రాయం మాత్రమే కాదు , నిన్నటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధులు ఎమ్ ఎల్ ఏ , ప్రభుత్వ విప్ రామమచంద్ర నాయక్ , ఘజల్ శ్రీనివాస్ , దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ , కార్యక్రమ నిర్వాహకులు ఎఫ్ టీ పీ సి ఇండియా అధ్యక్షులు చైతన్య జంగా , నటులు అశోక్ కుమార్ , కృష్ణుడు ఇంకా విచ్చేసిన అనేకుల మాట. రాబోయే రోజుల్లో కాబోయే స్టార్ యాంకర్ రజనీ అని చెప్పవచ్చు.