నూతనం గా పిల్లల ఆధార్ నమోదు కేంద్రాలు ప్రారంభం
స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో తెనాలి ఐ సి డి ఎస్
ప్రాజెక్ట్ సి డి పి ఓ ఆదేశాల మేరకు సున్న వయస్సు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల కోసం ఆధార్ నమోదు కేంద్రాలను తెనాలి 13 వార్డు లోని అంగన్వాడీ సెంటర్ నందురెండు ఆధార్ నమోదు కేంద్రాలను, మఠం బజార్, రజక పేట లోని అంగన్వాడీ సెంటర్ ఆధార్ కేంద్రం ఏర్పాటు చేసారు. ఈ కేంద్రాల్లో పిల్లల ఆధార్ నమోదు తో పాటు తల్లిదండ్రుల వివరాలు చేర్పులు, మార్పులు కూడా చేయబడుతుంది, ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని ఐ సి డి ఎస్ పి ఓ యం సునీత తెలిపారు. మంగళవారం ఆమె ఆధార్ కేంద్రాలను పర్యవేక్షించారు. వివరాలను వివరాలను వెల్లడించారు. బ్లూ 3 ఐ టి సంస్థ రాష్ట్రం లోని అల్లూరి సీతారామరాజు జిల్లా లోని పార్వతీపురం, మన్యం , ఏలూరు జిల్లాలలో గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజలకు సుమారు 3 లక్షల మందికి ఆధార్ కార్డ్లు నమోదు చేయడం జరిగిందని బ్లూ 3 ఐ టి మేనేజింగ్ డైరెక్టర్ తమనం రాకేష్ తెలిపారు. తన స్వగ్రామం తెనాలిలో అదార్ కేంద్రం ఏర్పాటు చేయడం సంతృప్తి గా ఉందన్నారు. అవసర మేరకు మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సౌజన్య , బ్లూ 3 ఐ టి సొల్యూషన్ సంస్థ ఆధార్ రీజనల్ కోఆర్డినేటర్ డేవిడ్ కమలాకర్, మొబైల్ ఆధార్ కో ఆర్డినేటర్స్ డేవిడ్, నాగరాజ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.