Skip to main content

Posts

Showing posts from February, 2025

ఆలిండియా వార్షిక ఆర్ట్ ఎగ్జిబిషన్ లో సత్తా చాటిన ప్రసన్న జ్యోతి

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆలిండియా వార్షిక ఆర్ట్ ఎగ్జిబిషన్ లో చిత్ర లేఖనం లో సత్తా చాటింది చిత్రకారిని  ప్రసన్న జ్యోతి మొబైల్ స్లోపాయిజన్ లా మనిషిని దెబ్బతీస్తుందంటూ ఏఎస్ రావు నగర్ కు చెందిన ఆర్టిస్ట్ కోట ప్రసన్న జ్యోతి తన పెయింటింగ్ ద్వారా సందేశమందించింది. తాను వేసిన ఈపెయింటింగ్ కు బెస్ట్ అవార్డు అందుకున్నారు. 84వ ఆలిండియా వార్షిక ఆర్ట్ ఎగ్జిబిషన్-2025లో భాగంగా ఆమె మొబైల్ ఎడిక్షన్ అంశాన్ని ప్రధానంగా తీసుకుని వేసిన పెయింటింగ్ న్యాయ నిర్ణేతలను ఔరా అనిపించింది. మొబైల్ కారణంగా మనిషి ఏవిధంగా యాంత్రికంగా మారుతున్నాడో పెయింటింగ్ ద్వారా తెలియజేశారు. మొబైల్ ను పాజిటివ్ గా వాడితే ఎంత మేలు చేకూరుతుందో, అదే నెగెటివ్ గా స్వీకరిస్తే అంత నాశనం చేస్తోందని తెలియ జేశారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ గాంధీ సెంటినరీ హాల్లో బుధవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవం లో నిజాం వారసుడు నవాబ్ రనౌక్ యార్ ఖాన్ నుంచి ప్రసన్న జ్యోతి బెస్ట్ అవార్డును అందుకున్నారు.

ఎపిడబ్ల్యూజెఎఫ్ డైరీ ఆవిష్కణ

ఎపిడబ్ల్యూజెఎఫ్ డైరీ ఆవిష్కణ   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్-2025 నూతన డైరీని తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనాసింహ బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం సేకరించిన రాష్ట్ర మంత్రివర్గ వివరాలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల  సమాచారాన్ని డైరీ లో పొందుపరిచారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ డైరీ ఆద్యంతం తిలకించారు. జిల్లా అధ్యక్షుడు కనపర్తి రత్నాకర్, జిల్లా కార్యదర్శి అంబటి శ్యామ్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెనాలి ఫెడరేషన్ గౌరవ సభ్యులు షణ్మఖేశ్వరరావు, తెనాలి ఫెడరేషన్  ప్రధాన కార్యదర్శి  ఎస్.ఎస్ జాహీర్, కోశాధికారి సిహెచ్ చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు అచ్యుత సాంబశివరావు, డి కోటేశ్వరరావు, వేమూరు ఫెడరేషన్ అధ్యక్షుడు మేకల సుబ్బారావు, సభ్యులు అత్తోట సంజయ్,  దేవరపల్లి నాగరాజు, దాసరి వెంకటేశ్వరరావు, ఉన్నం భూషణం, వి నాయుడు తదితరులు పాల్గున్నారు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – బౌలింగ్‌ గ్రీన్‌ స్టేట్‌ యూనివర్సిటీల మధ్య అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – బౌలింగ్‌ గ్రీన్‌ స్టేట్‌ యూనివర్సిటీల మధ్య అవగాహన ఒప్పందం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – యూఎస్‌ఏ– ఓహియోలోని బౌలింగ్‌ గ్రీన్‌ స్టేట్‌ యూనివర్సిటీల( బీజీఎస్‌యూ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. యూనివర్సిటీలోని ఆఫీస్‌ ఆఫ్‌ డీన్‌ ప్రమోషన్స్, కొలాబరేషన్స్‌ అండ్‌ ఫ్యాకల్టీ అఫైర్స్‌ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూఎస్‌ఏ– ఓహియోలోని బౌలింగ్‌ గ్రీన్‌ స్టేట్‌ యూనివర్సిటీ అకడమిక్‌ అఫైర్స్‌ ఇంటిరిమ్‌ వైస్‌ ప్రోవోస్ట్‌ ప్రొఫెసర్‌ రామ్‌ వీరపనేని, ఆర్కిటెక్చర్‌ అండ్‌ అప్లైడ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ డీన్‌ ప్రొఫెసర్‌ వేల్‌ మోక్తర్‌తో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన తమ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు బీజీఎస్‌యూతో కలిపి జాయింట్‌ డిగ్రీలను అం...

పరోపకారి పొన్నెకంటి పోతురాజు

పరోపకారి పొన్నెకంటి పోతురాజు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: పొన్నెకంటి పోతురాజుగారు గుంటూరు జిల్లా,తెనాలి సమీపంలోని కొలకలూరు గ్రామంలో 1926 ఫిబ్రవరి 16న జన్మించారు. పొన్నెకంటి సత్యవేదం, యోసేపు లు వీరి తల్లిదండ్రులు. పోతురాజు చిన్ననాట తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్టిన్. వీరి తల్లిదండ్రులకు కలిగిన ఐదుగురు పిల్లల్లో పోతురాజు మొదటి సంతానం .తరువాత వారు వరసగా ఎలీషా,విక్టోరియమ్మ,వీరాస్వామి, ఎలిజబెత్ లు.. పోతురాజు ఎస్.ఎస్. ఎల్.సి. వదలి,టీచర్ ట్రైనింగ్ చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. కొంపల్లి కమలమ్మతో పోతురాజుకు వివాహం జరిగింది. ఆమె కూడా ఉపాధ్యాయురాలే. వీరికి సంతానం ఆరుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వీరి పేర్లు:సుభాషిణి, సుహాసిని, విజయ కుమారి, శశి కిరణ్, సత్యకళ, బేబీ చంద్రకళ, హర్షవర్ధన్, చక్రవర్తి. వీరందరూ ఉన్నత విద్యలను అభ్యసించి, ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడినారు. ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్న చిన్న కుమారుడు తలిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ కొలకలూరు గ్రామంలోనే స్థిరపడ్డారు. పోతురాజుది సాధారణ కుటుంబమే అయినా, వీరిది ప్రత్యేకమైన కుటుంబం. అందుకే ఈ కథంతా. పోతురాజు చిన్ననాటి నుండే హ...

కళాకారుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన

కళాకారుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, రోటరీక్లబ్ తెనాలి వైకుంఠపురం, పట్ట రంగస్థల కళాకారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బుర్రిపాలెంరోడ్డులో బి.సి. కాలనీలోని కళాకారుల సంఘం భవనంలో రంగస్థల కళాకారుల కోసం ఉచిత నేత్రవైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాదు చెందిన ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన అనుబంధ సంస్థ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం, గూడవల్లిలోని డాక్టర్ కొమ్మారెడ్డి రాజారామ్మోహనరావు నేత్రవైద్య కేంద్రానికి చెందిన సిబ్బంది నేత్ర పరీక్షలు జరిపారు. దాదాపు రెండు వందల మంది కళాకారులు ఈ శిబిరంలో తమ నేత్రాలను పరీక్షించుకున్నారు. ఈ నేపథ్యంలో సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ కళ్ళను పరీక్షించుకున్న అవసరమైన వారికి పది రోజుల్లో కళాకారుల సంఘం తరఫున ఉచితంగా కళ్ళజోళ్ళు అందిస్తాము. శుక్లాలు వచ్చినవారికి ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రివారు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తారని డాక్టర్ సాయిమాధవ్ తెలిపారు. ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఈదర వెం...

సంకల్ప బలంతో పాటు నిజాయితీ ఉండాలి

సంకల్ప బలంతో పాటు నిజాయితీ ఉండాలి  - సినిమా డైరక్టర్, స్క్రీన్‌ రైటర్‌ కే.ఎస్‌.రవీంద్ర (బాబీ)   - మిమ్మల్ని మీరు నిరూపించుకోండి : పారా పిస్టల్‌ షూటర్, అర్జున అవార్డీ రుబినా ఫ్రాన్సిస్‌ - మహోత్సవ్‌తో విద్యార్థులకు నూతన అనుభవం : వర్సిటీ సీఈవో డాక్టర్‌ మేఘన కూరపాటి ( ఎమ్మెస్, ఎఫ్‌.పీ.ఓఎస్‌) -  విజ్ఞాన్‌లో వైభవంగా ముగిసిన మహోత్సవ్‌–2కే25  - ఘనంగా ‘‘వాయిస్‌ ఆఫ్‌ విజ్ఞాన్‌’’ మ్యాగజైన్‌ ఆవిష్కరణ  - క్రీడల్లో సత్తా చాటిన విద్యార్థి లోకం  ,- విజేతలకు ట్రోఫీలు, రూ.15 లక్షల నగదు బహుమతులు అందజేత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఉత్సాహం ఉరిమింది. క్రీడా సంద్రంలో యువత తడిసి ముద్దయింది.  విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి అదరహో అనిపించారు. కళాకారుల సందడి, క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శనలతో చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ  మరోసారి ఆటల మైదానంలో తనదైన ముద్రను చాటుకుంది. యూనివర్సిటీలో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి మహోత్సవం శనివారం ఘనంగా...

సందడి సందడిగా విజ్ఞానోత్సవ్‌

సందడి సందడిగా విజ్ఞానోత్సవ్‌ - దేశానికి అమూల్యమైన సంపద యువత : వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌  - రెండోరోజు వైభవంగా కొనసాగిన విజ్ఞాన్‌ మహోత్సవ్‌–2కే25  - విద్యార్థులతో ముచ్చటించి.. సందడి చేసిన సినీ తారలు  - పోటాపోటీగా కొనసాగుతున్న పోటీలు  -  అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు -  వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన విద్యార్థులు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:   నేటి ముగింపు కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఇండియన్‌ ఫిల్మ్‌ డైరక్టర్, స్క్రీన్‌ రైటర్‌ కే.ఎస్‌.రవీంద్ర (బాబీ), 2024 పారాలింపిక్స్‌ బ్రాంజ్‌ మెడలిస్ట్, ఇండియన్‌ పారా పిస్టల్‌ షూటర్, అర్జున అవార్డీ రుబినా ప్రాన్సిస్‌ ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 80 ఈవెంట్లు. కనుచూపు మేర ఎటువైపు చూసినా విద్యార్థులు క్రీడా సంబరాల్లో మునిగిపోయారు. వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, టేబుల్‌ టెన్నిస్, చెస్, అథ్లెటిక్స్, త్రోబాల్, ఫుట్‌బాల్, హాకీ, తైక్వాండో, ఖోఖో, ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్, యోగాసన..... ఇలా ఒకటేమిటి అనేక విభాగాల్లో విద్యార్థులు అద్భుత ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. ఒకరితో ఒకరు నువ్వ...

మీ మనసు చెప్పింది వినండి

మీ మనసు చెప్పింది వినండి  -  హీరో, డైరక్టర్, స్క్రీన్‌ రైటర్‌ విశ్వక్‌ సేన్‌  - విజ్ఞాన్స్‌ మహోత్సవ్‌లో ‘‘ లైలా ’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: విద్యార్థులందరూ మీ మనసు చెప్పింది మాత్రమే వినండని హీరో, డైరక్టర్, స్క్రీన్‌ రైటర్‌ విశ్వక్‌ సేన్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో జరుగుతున్న జాతీయస్థాయి విజ్ఞాన్స్‌ మహోత్సవ్‌–2కే25లో భాగంగా రెండో రోజు ‘‘ లైలా ’’ సినిమా యూనిట్‌ సందడి చేసింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో, డైరక్టర్, స్క్రీన్‌ రైటర్‌ విశ్వక్‌ సేన్‌ విజ్ఞాన్స్‌ మహోత్సవ్‌కు విచ్చేసి స్టెప్పులతో అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినిమా హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ ఈ నెల 14న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ లైలా సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పణలో షైన్‌ స్క్రీన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో సాహు గారపాటి నిర్మించారని వెల్లడించారు.  ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో యాక్షన్‌...

రేపటి నుంచి విజ్ఞాన్‌ మహోత్సవ్‌

రేపటి నుంచి విజ్ఞాన్‌ మహోత్సవ్‌ - మూడు రోజుల పాటు అలరించనున్న జాతీయ స్థాయి వేడుకలు - సందడి చేయనున్న సినీతారలు - ఆయా రాష్ట్రాల నుంచి 50 వేల మంది విద్యార్థులు రాక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్థాయి విజ్ఞాన్‌ మహోత్సవ్‌ 18వ ఎడిషన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ 18వ ఎడిషన్‌ విజ్ఞాన్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నేటి నుంచి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో ప్రతి ఏటా విజ్ఞాన్‌ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఇండియన్‌ సింగర్, మ్యూజిక్‌ కంపోజర్‌ డాక్టర్‌ సాలూరి కోటేశ్వరరావు ( కోటి), ఇండియన్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ అండ్‌ ప్లేబాక్‌ సింగర్‌ ఎస్‌.ఎస్‌.థమన్, గౌరవ అతిథిగా మాజీ ఇండియన్‌ వాలీబాల్‌ ప్లేయర్‌ మన్యం తులసి రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. రెండో రోజు కార్యక్రమానికి...

విజ్ఞాన్స్‌ విద్యార్థినికి తైక్వాండోలో జాతీయస్థాయి బంగారు పతకం

విజ్ఞాన్స్‌ విద్యార్థినికి తైక్వాండోలో జాతీయస్థాయి బంగారు పతకం టాలెంట్ ఎక్స్ ప్రెస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థినికి తైక్వాండోలో జాతీయస్థాయి బంగారు పతకం సాధించిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ తమ యూనివర్సిటీలో రెండో సంవత్సరం సీఎస్‌ఈ చదువుతున్న ఆర్‌.కళా జ్యోత్స ్న అనే విద్యార్థిని ఇటీవల తైక్వాండో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్‌ తైక్వాండో అసోసియేషన్‌ నిర్వహించిన 40వ జాతీయ సీనియర్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌ 2024–25లో బంగారు పతకం సాధించిందని వెల్లడించారు. తమ విద్యార్థిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరుపున అండర్‌  67 కేజీల సీనియర్‌ ఉమెన్‌ కేటగిరీలో పాల్గొని బంగారు పతకం కైవసం చేసుకుందని తెలియజేసారు. ఫైనల్లో కర్ణాటక రాష్ట్రం తరుపున పాల్గొన్న విద్యార్థిని మీద మొదటి రౌండ్‌లో 5–0, రెండో రౌండ్‌లో 8–3 తేడాతో ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. బంగారు పతకం సాధించిన ఆర్‌.కళా జోత్స ్నను విజ్ఞాన్స్‌ విద్యాసం...

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...