విజ్ఞాన్స్ యూనివర్సిటీ – బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీల మధ్య అవగాహన ఒప్పందం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ – యూఎస్‌ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీల( బీజీఎస్‌యూ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ బుధవారం తెలిపారు. యూనివర్సిటీలోని ఆఫీస్ ఆఫ్ డీన్ ప్రమోషన్స్, కొలాబరేషన్స్ అండ్ ఫ్యాకల్టీ అఫైర్స్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూఎస్‌ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ ఇంటిరిమ్ వైస్ ప్రోవోస్ట్ ప్రొఫెసర్ రామ్ వీరపనేని, ఆర్కిటెక్చర్ అండ్ అప్లైడ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొఫెసర్ వేల్ మోక్తర్‌తో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన తమ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు బీజీఎస్‌యూతో కలిపి జాయింట్ డిగ్రీలను అందజేయవచ్చునన్నారు. ఉదాహరణకు తమ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న విద్యార్థి 3 సంవత్సరాలు పాటు ఇక్కడ చదివి, 4వ సంవత్సరం కోర్సును బీజీఎస్‌యూలో చదవచ్చునన్నారు. బీజీఎస్‌యూలో వచ్చే క్రెడిట్స్‌ను ఆధారంగా చేసుకుని తమ యూనివర్సిటీ విద్యార్థికి యూజీ డిగ్రీను అందజేస్తామన్నారు. ఒకవేళ అదే విద్యార్థి 5వ సంవత్సరం కూడా బీజీఎస్‌యూలో ఉంటే వారికి బీజీఎస్‌యూ మాస్టర్స్ డిగ్రీను అందజేస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా యూఎస్‌ఏలో అక్కడే మరో మూడు సంవత్సరాలు పాటు ఉద్యోగం చేసుకోవడానికి కూడా అవకాశం లభిస్తుందన్నారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ అధ్యాపకలు, బీజీఎస్‌యూ అధ్యాపకులు కలిసి సంయుక్తంగా పరిశోధనలు, ప్రాజెక్టులు, ల్యాబ్‌లను కలిసి నిర్వహించుకుని సౌలభ్యం లభిస్తుందన్నారు. విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు లభించే అవకాశం ఉందన్నారు. ప్రాక్టికల్ ఇండస్ట్రీ అనుభవాన్ని అందించడంతో పాటు వృత్తిపరమైన వృద్ధిని పెంపొందిస్తామన్నారు. ప్రస్తుతం పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, వాటికి వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఉమ్మడిగా కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు వచ్చే స్టార్టప్ ఐడియాలను టెస్ట్ చేసుకోవచ్చనని తెలియజేసారు. ఈ సందర్భంగా యూఎస్‌ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ ఇంటిరిమ్ వైస్ ప్రోవోస్ట్ ప్రొఫెసర్ రామ్ వీరపనేని మాట్లాడుతూ విజ్ఞాన్స్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను సరికొత్త టెక్నాలజీల వైపు ప్రోత్సహించడంతో పాటు వారికి ఆయా రంగాలలో తర్ఫీదనివ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో యూఎస్‌ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ అండ్ అప్లైడ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొఫెసర్ వేల్ మోక్తర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ప్రొఫెసర్ శ్రీ కొల్ల, ఇంటర్నేషనల్ స్టూడెంట్ అడ్వైజర్ డాక్టర్ కెన్ (జాన్), విజ్ఞాన్స్ యూనివర్సిటీ సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, వర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.