టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆలిండియా వార్షిక ఆర్ట్ ఎగ్జిబిషన్ లో చిత్ర లేఖనం లో సత్తా చాటింది చిత్రకారిని
ప్రసన్న జ్యోతి మొబైల్ స్లోపాయిజన్ లా మనిషిని దెబ్బతీస్తుందంటూ ఏఎస్ రావు నగర్ కు చెందిన ఆర్టిస్ట్ కోట ప్రసన్న జ్యోతి తన పెయింటింగ్ ద్వారా సందేశమందించింది. తాను వేసిన ఈపెయింటింగ్ కు బెస్ట్ అవార్డు అందుకున్నారు. 84వ ఆలిండియా వార్షిక ఆర్ట్ ఎగ్జిబిషన్-2025లో భాగంగా ఆమె మొబైల్ ఎడిక్షన్ అంశాన్ని ప్రధానంగా తీసుకుని వేసిన పెయింటింగ్ న్యాయ నిర్ణేతలను ఔరా అనిపించింది. మొబైల్ కారణంగా మనిషి ఏవిధంగా యాంత్రికంగా మారుతున్నాడో పెయింటింగ్ ద్వారా తెలియజేశారు. మొబైల్ ను పాజిటివ్ గా వాడితే ఎంత మేలు చేకూరుతుందో, అదే నెగెటివ్ గా స్వీకరిస్తే అంత నాశనం చేస్తోందని తెలియ జేశారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ గాంధీ సెంటినరీ హాల్లో బుధవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవం లో నిజాం వారసుడు నవాబ్ రనౌక్ యార్ ఖాన్ నుంచి ప్రసన్న జ్యోతి బెస్ట్ అవార్డును అందుకున్నారు.