విజ్ఞాన్స్ విద్యార్థినికి తైక్వాండోలో జాతీయస్థాయి బంగారు పతకం
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ విద్యార్థినికి తైక్వాండోలో జాతీయస్థాయి బంగారు పతకం సాధించిందని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ తమ యూనివర్సిటీలో రెండో సంవత్సరం సీఎస్‌ఈ చదువుతున్న ఆర్.కళా జ్యోత్స ్న అనే విద్యార్థిని ఇటీవల తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ తైక్వాండో అసోసియేషన్ నిర్వహించిన 40వ జాతీయ సీనియర్ తైక్వాండో చాంపియన్‌షిప్ 2024–25లో బంగారు పతకం సాధించిందని వెల్లడించారు. తమ విద్యార్థిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుపున అండర్ 67 కేజీల సీనియర్ ఉమెన్ కేటగిరీలో పాల్గొని బంగారు పతకం కైవసం చేసుకుందని తెలియజేసారు. ఫైనల్లో కర్ణాటక రాష్ట్రం తరుపున పాల్గొన్న విద్యార్థిని మీద మొదటి రౌండ్‌లో 5–0, రెండో రౌండ్‌లో 8–3 తేడాతో ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. బంగారు పతకం సాధించిన ఆర్.కళా జోత్స ్నను విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి (ఎమ్మెస్, ఎఫ్.పీ.ఓఎస్), వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఫిజికల్ డైరక్టర్లు, కోచ్‌లు, విద్యార్థులు అభినందించారు.