ఎపిడబ్ల్యూజెఎఫ్ డైరీ ఆవిష్కణ
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్-2025 నూతన డైరీని తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనాసింహ బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం సేకరించిన రాష్ట్ర మంత్రివర్గ వివరాలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని డైరీ లో పొందుపరిచారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ డైరీ ఆద్యంతం తిలకించారు. జిల్లా అధ్యక్షుడు కనపర్తి రత్నాకర్, జిల్లా కార్యదర్శి అంబటి శ్యామ్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెనాలి ఫెడరేషన్ గౌరవ సభ్యులు షణ్మఖేశ్వరరావు, తెనాలి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ జాహీర్, కోశాధికారి సిహెచ్ చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు అచ్యుత సాంబశివరావు, డి కోటేశ్వరరావు, వేమూరు ఫెడరేషన్ అధ్యక్షుడు మేకల సుబ్బారావు, సభ్యులు అత్తోట సంజయ్, దేవరపల్లి నాగరాజు, దాసరి వెంకటేశ్వరరావు, ఉన్నం భూషణం, వి నాయుడు తదితరులు పాల్గున్నారు