మీ మనసు చెప్పింది వినండి
- హీరో, డైరక్టర్, స్క్రీన్ రైటర్ విశ్వక్ సేన్
- విజ్ఞాన్స్ మహోత్సవ్‌లో ‘‘ లైలా ’’ సినిమా యూనిట్ సందడి
విద్యార్థులందరూ మీ మనసు చెప్పింది మాత్రమే వినండని హీరో, డైరక్టర్, స్క్రీన్ రైటర్ విశ్వక్ సేన్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జరుగుతున్న జాతీయస్థాయి విజ్ఞాన్స్ మహోత్సవ్–2కే25లో భాగంగా రెండో రోజు ‘‘ లైలా ’’ సినిమా యూనిట్ సందడి చేసింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో, డైరక్టర్, స్క్రీన్ రైటర్ విశ్వక్ సేన్ విజ్ఞాన్స్ మహోత్సవ్‌కు విచ్చేసి స్టెప్పులతో అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినిమా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఈ నెల 14న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ లైలా సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో సాహు గారపాటి నిర్మించారని వెల్లడించారు. ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు. ఈ సినిమా తన మనసుకు బాగా దగ్గరైన సినిమానని తెలియజేసారు. ఈ సినిమాలో తన పాత్ర ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే వైవిధ్యభరితమైనదని తెలియజేసారు. మొట్టమొదటి సారిగా లైలా అనే అమ్మాయి పాత్రధారణలో నటించానని పేర్కొన్నారు. ఈ సినిమాకి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా లియోన్ జేమ్స్, సినిమాటోగ్రఫీ రిచర్డ్ ప్రసాద్, ఎడిటర్‌గా సాగర్, రైటర్‌గా వాసుదేవ మూర్తి పనిచేశారని వెల్లడించారు. అనంతరం లైలా సినిమా యూనిట్ విద్యార్థులతో సెల్ఫీలు దిగారు.