Skip to main content

సంకల్ప బలంతో పాటు నిజాయితీ ఉండాలి

సంకల్ప బలంతో పాటు నిజాయితీ ఉండాలి
 - సినిమా డైరక్టర్, స్క్రీన్‌ రైటర్‌ కే.ఎస్‌.రవీంద్ర (బాబీ)
  - మిమ్మల్ని మీరు నిరూపించుకోండి : పారా పిస్టల్‌ షూటర్, అర్జున అవార్డీ రుబినా ఫ్రాన్సిస్‌
- మహోత్సవ్‌తో విద్యార్థులకు నూతన అనుభవం : వర్సిటీ సీఈవో డాక్టర్‌ మేఘన కూరపాటి ( ఎమ్మెస్, ఎఫ్‌.పీ.ఓఎస్‌)
-  విజ్ఞాన్‌లో వైభవంగా ముగిసిన మహోత్సవ్‌–2కే25
 - ఘనంగా ‘‘వాయిస్‌ ఆఫ్‌ విజ్ఞాన్‌’’ మ్యాగజైన్‌ ఆవిష్కరణ
 - క్రీడల్లో సత్తా చాటిన విద్యార్థి లోకం
 ,- విజేతలకు ట్రోఫీలు, రూ.15 లక్షల నగదు బహుమతులు అందజేత
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఉత్సాహం ఉరిమింది. క్రీడా సంద్రంలో యువత తడిసి ముద్దయింది.  విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి అదరహో అనిపించారు. కళాకారుల సందడి, క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శనలతో చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ  మరోసారి ఆటల మైదానంలో తనదైన ముద్రను చాటుకుంది. యూనివర్సిటీలో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి మహోత్సవం శనివారం ఘనంగా ముగిసింది. ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ట్రోఫీలను, రూ.15 లక్షల నగదు బహుమతులను అందజేశారు. 
మన కలలను సాకారం చేసుకోవడానికి సంకల్ప బలంతో పాటు నిజాయితీ కూడా ఉండాలని సినిమా డైరక్టర్, స్క్రీన్‌ రైటర్‌ కే.ఎస్‌.రవీంద్ర (బాబీ) అన్నారు.  చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి విజ్ఞాన్‌ మహోత్సవ్‌ శనివారం అంగరంగ వైభవంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినిమా డైరక్టర్, స్క్రీన్‌ రైటర్‌ కే.ఎస్‌.రవీంద్ర (బాబీ) మాట్లాడుతూ మనం జీవితంలో ముందుకు వెళ్లాలంటే అల్లరితో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలన్నారు. మీకు ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగంలోకి వెళ్లిపోండని విద్యార్థులకు సూచించారు. మీ సంకల్పంలో నిజాయితీ ఉంటే అనుకున్నది తప్పకుండా జరిగి తీరుతుందన్నారు.
మిమ్మల్ని మీరు నిరూపించుకోండి :
 2024 పారాలింపిక్స్‌ బ్రాంజ్‌ మెడలిస్ట్, ఇండియన్‌ పారా పిస్టల్‌ షూటర్, అర్జున అవార్డీ రుబినా ఫ్రాన్సిస్‌
జీవితంలో మొదటగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని 2024 పారాలింపిక్స్‌ బ్రాంజ్‌ మెడలిస్ట్, ఇండియన్‌ పారా పిస్టల్‌ షూటర్, అర్జున అవార్డీ రుబినా ఫ్రాన్సిస్‌ అన్నారు. తాను పారాలింపిక్స్‌లో పతకం సాధించడానికి తల్లిదండ్రులు, కోచ్‌లు ఎంతగానో ప్రోత్సాహం అందిచారని తెలియజేసారు. జీవితంలో ఎప్పుడు కూడా మీ ప్రయత్నాన్ని విరమించుకోవద్దని విద్యార్థులకు సూచించారు. తాను 10వ తరగతి నుంచి స్పోర్ట్స్‌ జర్నీను ప్రారంభించానని వెల్లడించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 7వ స్థానంలో నిలిచినప్పుడు 6 నెలల పాటు కుంగుబాటుకు గురయ్యానని పేర్కొన్నారు. దానిని నుంచి త్వరగా కోలుకుని 2024 పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో దేశానికి బ్రాంజ్‌ మెడల్‌ తీసుకురాగలిగానన్నారు. 
మహోత్సవ్‌తో విద్యార్థులకు నూతన అనుభవం : వర్సిటీ సీఈవో డాక్టర్‌ మేఘన కూరపాటి ( ఎమ్మెస్, ఎఫ్‌.పీ.ఓఎస్‌)
విజ్ఞాన్స్‌ మహోత్సవ్‌ ద్వారా విద్యార్థులకు నూతన అనుభవం పొందే అవకాశం లభించిందని వర్సిటీ సీఈవో డాక్టర్‌ మేఘన కూరపాటి ( ఎమ్మెస్, ఎఫ్‌.పీ.ఓఎస్‌) అన్నారు. అంతేకాకుండా లీడర్‌షిప్‌ మరియు టీమ్‌ వర్క్‌ నేర్చుకోవడం, వివిధ కళా మరియు సాంకేతిక రంగాలలో మెరుగుదల, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర కళాశాల విద్యార్థులతో ఇంటరాక్షన్‌ పెరుగుతుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నృత్యం, పాటలు, డ్రామా, ఫ్యాషన్‌ షో లాంటి ప్రదర్శనలు విద్యార్థుల సృజనాత్మకతను వెలుగులోకి వస్తాయన్నారు. క్రీడలు – క్రికెట్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, మరియు ఇతర క్రీడలు విద్యార్థులలో స్పోర్ట్స్‌మాన్‌షిప్‌ను పెంపొందిస్తాయన్నారు. 
ఘనంగా ‘‘వాయిస్‌ ఆఫ్‌ విజ్ఞాన్‌’’ మ్యాగజైన్‌ ఆవిష్కరణ
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు, జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లు, వర్క్‌షాప్‌లు, అవగాహన ఒప్పందాలు, సెలబ్రటీ ఇంటర్వ్యూలు, అతిథి ఉపన్యాసాలు, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీ ప్రముఖుల ఉపన్యాసాలు, ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్లు, స్నాతకోత్సవాలు, ఫెస్ట్‌లు, స్పోర్ట్స్, స్టూడెంట్స్‌ యాక్టివిటీ క్లబ్స్, ఇతర సామాజిక కార్యక్రమలు వంటి వాటిని సమూహారంగా ఒకచోటికి చేర్చి విద్యార్థులకు అందజేయడమే లక్ష్యంగా రూపొందించిన ‘‘ వాయిస్‌ ఆఫ్‌ విజ్ఞాన్‌ ’’ మ్యాగజైన్‌ను అతిథులు ఆవిష్కరించారు.
విజ్ఞాన్‌ మహోత్సవ్‌ 2కే25 విజేతలు
జాతీయ స్థాయి విజ్ఞాన్‌ మహోత్సవ్‌లో భాగంగా మొత్తం 80 ఈవెంట్లను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు విలువైన నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందించారు. మహోత్సవ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రికెట్‌ చాంపియన్‌షిప్‌లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ జట్టు విజేతగా నిలిచి రూ.50 వేల నగదు బహుమతి సాధించింది. రన్నరప్‌గా నరసరావుపేట ఇంజినీరింగ్‌ కాలేజ్‌ జట్లు నిలిచాయి. మహిళల వాలీబాల్‌లో జీఈసీ కాలేజ్‌ ( మొదటి స్థానం ), ఎస్వీసీఈ ( రెండోస్థానం ) సాధించాయి. బాస్కెట్‌బాల్‌లో కేఎల్‌యూ (మొదటి స్థానం ), మోహన్‌బాబు యూనివర్సిటీ  (రెండోస్థానం ) సాధించాయి. కబడ్డీలో వీఎన్‌ఆర్‌ వీజేఐటీ ( మొదటి స్థానం ), ఎస్వీసీ ( రెండోస్థానం )లో నిలిచాయి. ఖోఖోలో అనురాగ్‌ యూనివర్సిటీ ( మొదటి స్థానం ), జీ.నారాయణమ్మ ఇంజినీరింగ్‌ కాలేజీ ( రెండోస్థానం ) నిలిచాయి.
వందకుపైగా విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు
మహోత్సవ్‌లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాలకు చెందిన వందకుపైగా యూనివర్సిటీలు, కళాశాలల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. 50వేల మందికి పైగా విద్యార్థులు ఆయా క్రీడాంశాల్లో పాల్గొన్నారు. సర్టిఫికెట్లు, మెమెంటోలతో పాటు రూ.15 లక్షల విలువైన నగదు బహుమతులను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 
కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో డాక్టర్‌ మేఘన కూరపాటి ( ఎమ్మెస్, ఎఫ్‌.పీ.ఓఎస్‌), వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...