భార్యాభర్తల బంధం గురించి తెలియజెప్పిన "ఎనిమిదో అడుగు" నాటిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: మూడుముళ్లతో పాటు నడిచిన ఏడడుగులు మరచి తప్పనిసరి అనుకుని ఎనిమిదో అడుగు వేస్తే అది తప్పకుండా తప్పటడుగు అవుతుంది అని తెలియ జెప్పింది ఎనిమిదో అడుగు నాటిక. సికింద్రాబాద్ రైల్ నిలయం ఆడిటోరియంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన ఎనిమిదో అడుగు నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ సినీ నాటక రచయిత శ్రీ మాడభూషి దివాకర బాబు రచించిన ఈ నాటికకు డా.శ్రీజ సాదినేని దర్శకత్వం వహించడమే కాకుండా ఈనాటికలో శ్రీముఖి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. శంకర్ నారాయణ పాత్రలో శశిధర్ ఘణపురం, పార్ధుగా అవినాష్ పోటాపోటీగా నటించారు. మహిళా దినోత్సవ వేడుకలలో 33 తెలుగు నాటకాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు శ్రీజ సాదినేని డైరెక్ట్ చేసిన ఈ నాటికను ప్రదర్శించడం విశేషం అంటూ ముఖ్య అతిథులు, ప్రేక్షకులు శ్రీజను అభినందించారు. ఈ సందర్భంగా దర్శకురాలు శ్రీజ సాదినేనిని ముఖ్య అతిథులు ఘనం...