*ఉమెన్స్ డే ప్రత్యేక కధనం*
HAPPY WOMENS DAY - 2025
*ఇంటి భోజనాన్ని తయారు చేసి ఆన్ లైన్ అమ్మకాల ద్వారా లక్ష రూపాయలు పైబడి సంపాదిస్తున్న మహిళలు*
*మహిళలకు షీరో హోమ్ ఫుడ్ అందిస్తున్న గొప్ప స్వయం ఉపాధి*
మహిళలు నేడు అన్ని రంగాలలోను పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. వ్యాపార ఉద్యోగ రంగాలలో నేడు విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ కొందరు మహిళలు వివిధ కారణాల రీత్యా ఇంటిగడప దాటలేని పరిస్థితి, కానీ ఏదో ఒక్కటి చేసి తమ కుటుంబానికి చేదోడు వాదోడుగా వుండాలని పరితపిస్తూ వుంటారు. ముఖ్యంగా తమకు తెలిసిన వంటలతో ఎంతో కొంత ఆదాయాన్ని పొందాలని ఎందరో ఆలోచిస్తుంటారు. కానీ వాటిని ఎక్కడ ఎలా అమ్మాలో తెలియక సతమతమవుతూ వుంటారు. అటువంటి మహిళలకు మేము ప్రోత్సాహం అందిస్తాం అంటూ 4 సంవత్సరాల కింద ముందుకొచ్చిన సంస్థే షీరో హోమ్ ఫుడ్. మహిళలు తమకు తెలిసిన వంట నైపుణ్యానికి షీరో సంస్థ అందించే మెళకువలను జోడించి దక్షిణ ఉత్తరాది వంటకాలను రుచికరంగా శుచికరంగా తయారు చేసి ప్రతినెలా ఆయా ప్రాంతాన్ని భట్టి పది వేల నుండి లక్ష రూపాయల పైబడి సంపాదించి తమ వంట గదినుండే మహిళలు వ్యాపారవేత్తగా రాణించేలా ప్రోత్సహిస్తోంది.ప్రతి మహిళ తాము చేసే వంట రుచికరంగా చేసేందుకే తపన పడతారు, అయితే వారు చేసే వంట అమీర్ పేట లో చేసిన , అనకాపల్లి లో చేసినా ,అమెరికా లో చేసినా ఒకే రంగు ఒకే రుచి తో పాటు ఒకేలా కనబడేలా వుండేందుకై అన్ని రకాల వంటకాలకు షీరో హోమ్ ఫుడ్ ఉచిత శిక్షణను అందిస్తోంది. తెలుగు వంటకాలే కాకుండా తమిళనాడు , కేరళ మరియు ఉత్తరాది రుచులు సైతం అవలీలగా నిర్ణీత సమయంలో చేసేలా తర్ఫీదుని ఇస్తోంది.అంతేకాకుండా వారు చేసిన వంటకాలని తమ వెబ్ సైట్, ఆప్ తో పాటు స్విగ్గీ , జొమాటో, వాయు , ఓ ఎన్ డి సీ వంటి అనేక ఫుడ్ డెలివరీ పార్టనర్స్ తో భాగస్వామ్యాన్ని కల్పించి చక్కని ఆదాయాన్ని పొందేలా షీరో హోమ్ ఫుడ్ మహిళా సాధికారతకు కృషి చేస్తోంది.పప్పు పచ్చడి సాంబార్ వంటి ఇంటి భోజన వంటకాలనే కాకుండా వారు నిష్ణాతులుగా వున్న తినుబండారాలు మరియు ఇతర అనేక వంటకాలు ఈ ప్లాట్ ఫామ్ ద్వారా విక్రయించుకొని స్థిరమైన ఆదాయాన్ని ఆర్జించేలా చేస్తోంది.పెట్టుబడి లేకుండా ఇంట్లో వుండే స్టవ్ , గిన్నెలతో ప్రారంభించదగ్గ వ్యాపార మోడల్ తో పాటు కొద్దిపాటి పెట్టుబడితో నలుగురు లేదా అయిదుగురు మహిళలు కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కమ్యూనిటీ కిచెన్ ని ప్రారంభించి సంపూర్ణ వ్యాపార మోడల్ లో మూడు లక్షల రెవిన్యూ పొందేలా మరో బిజినెస్ మోడల్ ని కూడా షీరో హోమ్ ఫుడ్ నిర్వహిస్తోంది. ఆశక్తి కలవారికి ముందుగా ఓ సెమినార్ ని నిర్వహించి వ్యాపార నమూనాను విశదీకరించి తాము చేయగలం అని ముందుకు వచ్చిన మహిళామణులకు షీరో కుటుంభంలో భాగస్వామ్యాన్ని కల్పిస్తోంది. షీరో లో చేరి ఎందరో మహిళలు తమ స్వయం శక్తితో పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు, పిల్లల ఫంక్షన్స్ గర్వంగా చేసుకోగలుగుతున్నారు..ఇలా భర్తలకు చేదోడుగా ఉండగలిగే స్థాయిలో ఉన్నందుకు గర్విస్తున్నారు. నేను మహిళా ఎంట్రప్రెన్యూర్ ని అని తలెత్తుకొని నలుగురితో గర్వంగా చెప్పుకొంటున్నారు. మా ఇంట్లో మా నాన్న హీరో అయితే అమ్మ షీరో అని పిల్లలు గర్వంగా చెప్పుకొంటున్నారు. ఇప్పటికే 3 వేల మంది మహిళలకు చేయూతగా నిలిచిన షీరో హోమ్ ఫుడ్ సంస్థ కొద్ది సంవత్సరాలలోనే పది లక్షల మంది మహిళలకు చేయూతగా నిలవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. తెలుగు రాష్ట్రాల లోని జిల్లా ప్రధాన నగరాల మొదలు హైదరాబాద్ సిటీలోని అన్ని ప్రాంతాల్లో ఈ కిచెన్ ని ప్రారంభించి మహిళలు స్వయం ఉపాధికి బాటలు వేసుకోవచ్చు. ఆసక్తి కల మహిళలు ఉచిత సెమినార్ లో పాల్గొనేందుకై 6309527444 నెంబర్ కి తమ పేరు ఏరియా సిటీ ని వాట్సాప్ చేస్తే ఏ తేదీన సెమినార్ లో పాల్గొనాలో తెలియచేస్తామని సంస్థ కన్వీనర్ అంటున్నారు.
*ఒక్క కిచెన్ తో ప్రారంభించి 3 వేల మంది మహిళలకు సాధికారికత కల్పించిన వ్యవస్థాపకులు*
ఒక్క కిచెన్ గా ప్రారంభం ఐన షీరో సంస్థని తెలుగు మూలాలు వున్న తిలక్ వెంకటస్వామి , జయశ్రీ తిలక్ లు నేడు దక్షిణాది 3 వేల పైబడి కిచెన్స్ గా తీర్చిదిద్ది ఆయా మహిళల ద్వారా 3 వేల కుటుంబాలు అభివృద్ధి బావుటా పట్టేలా షీరో హోమ్ ఫుడ్ ని తీర్చి దిద్దారు. తెలుగు రాష్ట్రాలలో 300 మంది ఈ షీరో హోమ్ ఫుడ్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్, విశాఖపట్టణం , విజయవాడ , గుంటూరు , వరంగల్ , ఖమ్మం వంటి పట్టణాలలోనే కాకుండా జగిత్యాల , తాడేపల్లి గూడెం, తెనాలి ,శ్రీకాళహస్తి , మంగళగిరి వంటి తృతీయ పట్టణాలలో సైతం ఎందరో మహిళలు
ఉపాధి పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సువర్ణా దేవి పాకలపాటి మాట్లాడుతూ :- మండల స్థాయినుండి రాష్ట్ర స్థాయివరకు డెలివరీ పార్టనర్స్ వున్న ప్రతి ప్రాంతంలో మహిళలకు శిక్షణ ఇచ్చి ఈ ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ వారు ప్రవేశించేలా కృషిచేస్తున్నామని, రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో సైతం ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి తెలుగు రాష్ట్రాలలోని ఒక లక్ష కుటుంబాలకు అండగా నిలవాలన్నదే తమ సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు.