డా. కె.కె.ఆర్. హ్యాపీ వ్యాలీ స్కూల్ వారి ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ పోటీలు
- విజేతలకు రెండున్నర లక్షల రూపాయల నగదు బహుమతులు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
యువతలో వున్న సృజనాత్మకతను, సమాజం పట్ల వారికి అవగాహన కలిగించేందుకు ‘డా. కె.కె.ఆర్. హ్యాపీ వ్యాలీ స్కూల్’ మరియు ’64 కళలు.కాం’ – ‘స్పూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్’ వారు నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2025 కు పది నిమిషాల లోపు షార్ట్ ఫిల్మ్ లను రూపొందించి పంపవచ్చు.
________________________________________
బహుమతులు:
1st బెస్ట్ ఫిల్మ్ రూ.: 1,00000/-
2nd బెస్ట్ ఫిల్మ్ రూ.: 50,000/-
3rd బెస్ట్ ఫిల్మ్ రూ.: 30,000/-
వీటితో పాటు మరి కొన్ని నగదు బహుమతులు కూడా.
_________________________________________
క్రింది పది అంశాలలో ఏదో ఒక దానిని కథావస్తువుగా తీసుకోవాలి. (Themes) :
1) సహాయం చేయు.
2) కృతజ్ఞత.
3) పెద్దల పట్ల గౌరవం.
4) మీ జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి?.
5) ప్రకృతితో స్నేహం చేయడం.
6) స్నేహం యొక్క విలువ.
7) ఆడపిల్లను రక్షించండి.
8) దయార్థహృదయం.
9) ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం వల్ల కలిగే నష్టాలు.
10) ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా జీవించాలి.
అర్హతలు:
1) 18 సంవత్సరాలు వయసు దాటిన వారందరూ అర్హులు.
2) క్రింది ఇచ్చిన పది అంశాలలో మాత్రమే షార్ట్ ఫిల్మ్ నిర్మించాలి.
3) షార్ట్ ఫిల్మ్ నిడివి నాలుగు నుండి పది నిమిషాల లోపు వుండాలి.
4) షార్ట్ ఫిల్మ్ తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో మాత్రమే వుండాలి.
5) ప్రవేశ రుసుము రూ. 500/-
6) మీ ఎంట్రీ పంపడానికి చివరి తేదీ: ఏప్రిల్ 2, 2025
7) బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సొంతంగానూ లేదా కాపీ మ్యూజిక్ కూడా వాడుకోవచ్చు.
8) Google Form Link: https://docs.google.com/forms/d/e/1FAIpQLSemKfr1xHrTVSXwXot61xdcn3gq6rNsMv82NBpVhlebKcoeWQ/viewform?usp=header